
- సంగారెడ్డి జిల్లా బొల్లారంలో ఘటన
జిన్నారం, వెలుగు : నెల పసిగుడ్డును గుర్తు తెలియని వ్యక్తులు ఆలయంలో వదిలేసి వెళ్లిన ఘటన సంగారెడ్డి జిల్లాలో జరిగింది. బొల్లారం మున్సిపల్ పరిధిలోని జగన్నాథ ఆలయంలోని టేబుల్ పై మంగళవారం సాయంత్రం మగ బిడ్డను పడుకోబెట్టి వెళ్లారు. గుక్క పట్టి బిడ్డ ఏడుస్తుండగా స్థానికులు విని అక్కడికి వెళ్లారు. ఎవరూ కనిపించకపోవడంతో పోలీసులకు సమాచారం అందించారు.
స్థానికంగా గాలింపు చేపట్టిన ఆచూకీ తెలియలేదు. ఆ చిన్నారిని సంగారెడ్డిలోని చైల్డ్ ప్రొటెక్షన్ సెంటర్ కు తరలించారు. బాబుకు సంబంధించిన సమాచారం ఎవరికైనా తెలిస్తే తమను సంప్రదించాలని బొల్లారం సీఐ రవీందర్ రెడ్డి సూచించారు.